- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏయిర్ ఇండియా విమానం క్రాష్.. పైలట్ మృతి
X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఏయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం రన్ వే ను దాటి 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, 80మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
శుక్రవారం సాయంత్రం సరిగ్గా 7.40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 191మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి కోజికోడ్ చేరుకున్న విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పింది. ఏయిర్ పోర్టులో కుండపోత వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సుమారు 20 అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story