రీఫండ్ ఇవ్వలేని స్థితిలో విమానయాన సంస్థలు!

by Harish |
రీఫండ్ ఇవ్వలేని స్థితిలో విమానయాన సంస్థలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వలన విమానాల ప్రయాణాలు ఆగిపోయాయి. లాక్‌డౌన్ విధించే సమయంలో సమయంలో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు క్యాష్ రీఫండ్ చేయాల్సి ఉంది. కానీ, నగదు కొరత వల్ల చాలా విమానయాన సంస్థలు ప్రయాణికులకు చెల్లించాల్సి ఉన్నా రూ. 3,000 కోట్లను ఇప్పట్లో రీఫండ్ చేసే అవకాశంలేదని సమాచారం. దీనివల్ల టికెట్ కేన్సిలేషన్‌కు సంబంధించిన క్రెడిట్ షెల్స్ ఉన్నవారు ఎక్కువకాలం వేచి ఉండాల్సి వస్తోంది. ప్రయాణీకులకు ఇప్పటివరకు సుమారు రూ. 1,500 కోట్లను రీఫండ్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే, మొత్తం చెల్లించే పరిస్థితి లేనందున టికెట్ కేన్సిల్ చేయడం ద్వారా ఆ మొత్తంతో భవిష్యత్‌లో ప్రయాణం చేయవచ్చని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వంతో ఎయిర్‌లైన్స్ సంస్థల చర్చల అనంతరం రీఫండ్లు పెరిగాయి. అయితే, విమానయాన రంగం ఆర్థికంగా దారుణమైన స్థితిలో ఉన్నందున, ప్రయాణీకులకు మొత్తం రీఫండ్ సాధ్యం కాదని చెబుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, చెల్లించాల్సిన ఆ సొమ్మును క్రెడిట్ షెల్‌లో ఉంచనున్నట్టు వెల్లడించాయి. నిధుల కొరత వల్ల విమానయాన సంస్థలను నగదు రీఫండ్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు.

ఎయిర్‌లైన్స్ సంస్థలకు నష్టాలతో అప్పుల్లో ఉన్నట్టు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణీకులకు, విమానయాన సంస్థలకు నష్టం కలగకుండా పరిష్కారం చూడాలని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏవియేషన్ రెగ్యులేటరీ ప్రకటనకు లోబడి రీఫండ్ నిబంధనలు పాటిస్తున్నామని స్పైస్ జెట్ చెప్పగా, పరిశ్రమ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్టు ఇండిగో వెల్లడించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నగదు తిరిగి చెల్లించడం అంత సులభమైన విషయం కాదని, కొన్ని సంస్థలు మాత్రమే నగదు లభ్యత కలిగి ఉండవచ్చునని, ఆ మాత్రంతో నగదు ఉన్నట్టు కాదని, కొన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, జరిగిన నష్టాన్ని, ఖర్చులను తగ్గించుకునేందుకు వ్యూహాల కోసం చూస్తున్నాయన్ని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో క్రెడిట్ షెల్ విధానంతో సంస్థలకు కొంత భారం తగ్గుతుందని చెబుతున్నారు. క్రెడిట్ షెల్ విధానంలో ప్రయాణీకులకు చెల్లించేందుకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed