- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు నాటికి పూర్తవుతున్న ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ వాటా విక్రయం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లలో ప్రభుత్వ వాటా అమ్మకాన్ని జులై-ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వచ్చే రెండు నెలల్లో బిడ్‌లను సమర్పించాలని ప్రభుత్వం కోరనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియను ముగించాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆలస్యమైంది.
ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) జూన్ నాటికే వాటా అమ్మకాల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బిడ్డర్లకు తగిన సమయం కేటాయించాలని భావిస్తోంది. బీపీసీఎల్‌లో వాటా కోసం ఇప్పటికే వేదాంత సహా మొత్తం మూడూ ప్రాథమిక బిడ్‌లు ప్రభుత్వానికి అందాయి. అలాగే, ఎయిర్ ఇండియా కోసం టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణను సమర్పించింది. కాగా, 2021-22లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్లను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే.