- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ న్యూస్ : టాటా గ్రూప్స్ చేతికి ఎయిర్ ఇండియా.. 68 ఏళ్ల తర్వాత!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన వేలం పాటను కూడా నిర్వహించారు. అయితే, రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్స్ ఎయిర్ ఇండియా తిరిగి దక్కించుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఓపెన్ బిడ్ ద్వారా ఈ వేలాన్ని టాటా సన్స్ దక్కించుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియలో టాటా గ్రూప్, స్పైస్ జెట్, టాటా సన్స్ బిడ్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటాల చేతికి ఎయిర్ ఇండియా వెళ్తున్నట్టు సమాచారం.
గతంలో ఎయిర్ ఇండియా సంస్థ టాటా గ్రూప్ చేతిలో రన్ అవ్వగా, నాటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వపరం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లు బాగానే నడిచిన ఎయిర్ ఇండియా అనుకోకుండా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతీఏటా ప్రభుత్వం పెట్టుబడులు పెడుతూ ఆ నష్టాన్ని పూడుస్తూ వచ్చింది. అయితే, అప్పులు క్రమేపి పెరగడం, లాభాలు రాకపోగా కనీసం ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో నిర్వహించిన వేలంలో టాటా గ్రూప్ తిరిగి ఎయిర్ ఇండియాను కైవసం చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే, డిసెంబర్ నాటికి ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల చేతికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.