300 స్టోర్ల నిర్వహణే లక్ష్యం : బిగ్‌బజార్!

by Harish |   ( Updated:2020-12-13 08:24:09.0  )
300 స్టోర్ల నిర్వహణే లక్ష్యం : బిగ్‌బజార్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వందకు పైగా నగరాల్లో ఉనికిని కలిగిన ప్రముఖ హైపర్‌ మార్కెట్ చైన్ బిగ్‌బజార్ కొత్తగా 16 స్టోర్లను ప్రారంభించాలని భావిస్తోంది. రానున్న మూడు త్రైమాసికాల్లో కొత్త స్టోర్లను ఓపెన్ చేసి మొత్తం స్టోర్ల సంఖ్యను 300 కు పెంచుకోవాలని భావిస్తున్నట్టు బిగ్‌బజార్ సీఈఓ సదాశివ్ నాయక్ చెప్పారు. బిగ్‌బజార్ మాతృ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ విస్తరణ వ్యూహంలో భాగంగా భారత్‌లోని చిన్న టైర్ 2 నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వచ్చే మూడు త్రైమాసికాల్లో మొత్తం 300 హైపర్‌ మార్కెట్ స్టోర్ల మైలురాయిని పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సదాశివ్ వివరించారు. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ 100కు పైగా నగరాల్లో 284 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ సంఖ్యను పెంచుకోవడం ద్వారా తాము దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్టోర్లను కలిగి ఉంటామని ఆయన తెలిపారు. అయితే, బిగ్‌బజార్ విస్తరణపై ఫ్యూచర్ రిటైల్ ఎలాంటి ఆర్థిక, పెట్టుబడి వివరాలను ఆయన చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న అప్పులను తీర్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో బిగ్‌బజార్ నిర్వహణ అంశంపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం స్టోర్లలో కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని, పండుగ సీజన్ కారణంగా ఫ్యాషన్ స్టోర్లతో పాటు అన్ని విభాగాల్లో మెరుగైన అమ్మకాలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కోలుకునే దిశగా వెళ్తున్నాం. సాధారణ స్థితికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని, వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు జరిగిన తర్వాత సాధారణ స్థితికి చేరుకోగలమనే నమ్మకం ఉందని సదాశివ్ నాయన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed