- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్‌లో బీజేపీ నేతలు కుట్రకు తెరలేపారు
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను అస్థిర పరిచి కూల్చే కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసినట్లుగా రాజస్థాన్‌లో చేయాలని బీజేపీ అగ్రనేతలు కుట్రకు తెరలేపారని ఆరోపించారు. వెయ్యి కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగులు చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేను రూ.50కోట్లతో కొనుగోలు చేస్తోందన్నారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్లు బీజేపీకి అనుబంధ సంఘాలుగా వ్యవహరిస్తున్నాయని, వాటి ద్వారా అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇండ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్నికుట్రలు చేసినా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందన్నారు.