- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రజలకు ఓ శుభవార్త
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో భోగాపురం ఎయిర్ పోర్టుకి మోక్షం లభించింది. విశాఖపట్టణంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ… నేవీ కేంద్రం కావడంతో సున్నితమైన జోన్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట ల్యాండింగ్ సమస్యాత్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా, భోగాపురంలో అన్ని హంగులతో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయగా, ఆ తరువాత పని పడకేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసేందుకు సీఎం జీఎంఆర్ గ్రూప్‌ని రంగంలోకి దించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్ గ్రూపు మధ్య ఒప్పందం కుదిరింది.
జీఎంఆర్ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం సాకారం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టును విశాఖ నగరంతో అనుసంధానం చేస్తామని, భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ నగరానికి సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అటు, జీఎంఆర్ ప్రతినిధులు కూడా ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలు తీసుకుంటామని తెలిపారు.