- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిలయన్స్ రిటైల్ లో కేకేఆర్ ఇన్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడులను పెట్టిన సంస్థలు ఇప్పుడు రిలయన్స్ రిటైల్ (Reliance Retail)లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. తాజాగా, రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ సంస్థ సుమారు రూ. 7500 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఈ ఒప్పందం జరిగిన అనంతరం మరో సంస్థ కేకేఆర్ (KKR) కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని సమాచారం.
చర్చలు సఫలమైతే సెప్టెంబర్ చివరినాటికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. రిలయన్స్ రిటైల్ (Reliance Retail)విభాగంలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సిల్వర్ లేక్ (Silver Lake) సుమారు రూ. 7500 కోట్లను పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకుందని బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరింది.
రిలయన్స్ రిటైల్‌లో మైనారిటీ వాటాను విక్రయించడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్‌లో 10 శాతం వరకు వాటాలను విక్రయించనున్నారు. కాగా, రిటైల్ వ్యాపార వృద్ధికి రిలయన్స్ సంస్థ ప్రయనిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.