అందులో మహేష్ శ్రీరాముడు కాదంట.. మరెవరు..?

by Shyam |   ( Updated:2021-08-20 03:51:29.0  )
అందులో మహేష్  శ్రీరాముడు కాదంట.. మరెవరు..?
X

దిశ, సినిమా: ‘దంగల్’, ‘చిచోరే’ సినిమాల తర్వాత నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న మెగా ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న చిత్రాన్ని మధు మంతెన, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మించనుండగా.. 2022లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మూడు పార్ట్‌లుగా వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే సీతమ్మగా, సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా, హృతిక్ రోషన్ రావణాసురుడిగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే శ్రీరాముడి పాత్రలో నటించేందుకు మహేష్ నో చెప్పడంతో మేకర్స్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. కాగా మేకర్స్ ఈ దీపావళి రోజున అఫిషియల్‌గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Advertisement

Next Story