సెమీకండక్టర్ల తయారీలోకి టాటా గ్రూప్ సంస్థ

by Harish |
సెమీకండక్టర్ల తయారీలోకి టాటా గ్రూప్ సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ సంస్థ సెమీకండక్టర్ తయారీ విభాగంలో ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని సంస్థ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. భవిష్యత్తులో డిజిటల్ రంగం అత్యంత కీలకంగా ఉండనుందని, విద్య, వైద్యం, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో డిజిటల్ విభాగం కీలకపాత్ర పోషించనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుగ్గాను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమీకండక్టర్లు, 5జీ పరికరాల తయారీలోకి సంస్థ ప్రవేశించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ క్రమంలో డిజిటల్ విభాగంలో ఉపాధి అవకాశాలపై ఆయన మాట్లాడారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా జీవన విధానం పూర్తిగా మారిపోయింది. వ్యాపారాలు కూడా అనేక మార్పులను చూశాయి. సాంకేతికత, కొత్త రకం సరఫరా, పర్యావరణ అనుకూల అభివృద్ధి వైపునకు వ్యాపారాలు మళ్లుతున్నాయి. వీటిలో ఆరోగ్య సంబంధిత అంశం ప్రధానమైనది. ఈ అంశాలపై టాటా గ్రూప్ సంస్థ దృష్టి సారిస్తోంది. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలన్నీ వీటి చుట్టూరా ఉంటాయని చంద్రశేఖరన్ అన్నారు.

Advertisement

Next Story