- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
100రోజులు గడిచినా.. కేసులు తగ్గట్లేదు!
దిశ, వెబ్ డెస్క్ : భారత్‌లో కరోనా ప్రళయం కొనసాగుతూనే ఉంది. రోజువారీగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో గల జీబీటీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఈ పాకెట్ ప్రాంతంలో ఇప్పటివరకు 25 పాజిటివ్ కేసులు వచ్చాయి. కేసులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం 100 రోజులుగా కంటైన్‌మెంట్ జోన్‌లోనే ఉంది. ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాలన్నింటినీ సీలు చేశారు. ఏప్రిల్ 6న ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు నివాసితుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఎం త్రిపాఠి తెలిపారు.
ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక్కడి ప్రజల ఆరోగ్య రక్షణకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇక్కడి ప్రజలకు రోగనిరోధక శక్తి పెంపుదలకు ఔషధాలను పంపిణీ చేసిందని వివరించారు. కేసులు పెరుగుతున్న చోటల్లా రెగ్యూలర్ శానిటైజేషన్ జరుగుతోందని, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారని చెప్పారు. ఇక్కడ సుమారు 5వేల మంది నివసిస్తున్నారని, 1,026 ఫ్లాట్లు ఉన్నాయని త్రిపాఠి స్పష్టంచేశారు. కేసులు ఇంకా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు.