- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్వకేట్ హత్యాయత్నం కేసుపై వీడని సందిగ్ధత..!
దిశ, క్రైమ్ బ్యూరో: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాయవాదిపై హత్యాయత్నం కేసును పోలీసులు చేధించినా.. అందులోని చిక్కుముడులు మాత్రం వీడడం లేదు. పోలీసులు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే మంథనిలో న్యాయవాది దంపతులు హత్య ఘటన మరువక ముందే, మరో న్యాయవాదిపై హత్యాయత్నం జరగడం, ఆ సమయంలో కత్తులతో బెదిరించడం సంచలనంగా మారింది. అంతేగాకుండా, మరో వ్యక్తి తుపాకీతో ఇంటి ముందు గేటు వద్ద పహారా కాసిన విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నెల 16వ తేదీన హిమాయత్‌నగర్‌లోని సిద్దార్థ్ సింగ్ చౌదరి నివాసంలోకి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి డాక్టర్ సాబ్ ఫైల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరెవరూ అని ప్రశ్నించే లోపే ఆయనపై దాడి చేసినట్టుగా న్యాయవాది సిద్దార్థ్ సింగ్ నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా.. తనపై దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులతో పాటు డాక్టర్ సాబ్ (డాక్టర్ మాలిక్ అలియాస్ సిరాజుద్దీన్) పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, నారాయణగూడ పోలీసులు ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారే కానీ, డాక్టర్ మాలిక్‌ను అరెస్టు చేయకపోవడం ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న అంశం. డాక్టర్ మాలిక్ పేరు చెప్పి దాడి చేసినట్టుగా చెపుతున్నా.. డాక్టర్ మాలిక్ ఎవరనేదానికి పోలీసుల నుంచి సమాధానం రావడం లేదు. ఇదిలా ఉండగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో డాక్టర్ సాబ్ అని మాత్రమే రాశారు కానీ, ఆయన పూర్తి పేరును డాక్టర్ మాలిక్ అలియాస్ సిరాజుద్దీన్ అని మాత్రం రాయకపోవడంలో పోలీసుల ఆంతర్యం ఏంటోనంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించిన పలు ప్రెస్‌మీట్ సమావేశాలలో ఏ1 సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించారంటూ అని అడిగిన ప్రశ్నలకు ఏదైనా ఎవిడెన్స్ ఆధారంగానే ఎఫ్ఐఆర్‌లో పేర్ల మార్పులు, చేర్పులు జరుగుతాయని స్వయంగా సీపీ అంజనీకుమార్ తెలిపారు. నారాయణగూడ న్యాయవాది కేసులో ఒకవేళ డాక్టర్ మాలిక్ పాత్ర లేకుంటే.. ఎఫ్ఐఆర్‌లో డాక్టర్ సాబ్ అనే పేరు కూడా ఉండకూడదు కదా.. అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డాక్టర్ సాబ్ అని మాత్రమే ఉండటంతో ఎఫ్ఐఆర్‌లో ఉండటంతో ఈ కేసుతో డాక్టర్ సాబ్ అలియాస్ డాక్టర్ మాలిక్ అలియాస్ సిరాజుద్దీన్‌కు సంబంధం ఉన్నట్టా.. లేనట్టా అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టుగా స్పష్టమవుతోంది. బాధితుడు తన ఫిర్యాదులో డాక్టర్ సాబ్ పేరును డాక్టర్ మాలిక్ అలియాస్ సిరాజుద్దీన్ అని స్పష్టంగా ఉన్నప్పటికీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కేవలం డాక్టర్ సాబ్ అని మాత్రమే రాయడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవిడెన్స్ ఆధారంగా ఎఫ్ఐఆర్‌లో మార్పులు చేర్పులు చేయాల్సిన పోలీసులు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులుగానే ఉంచడం ఏంటనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.