- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పేస్‌లో ఫొటోషూట్.. ఖరీదెంత?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల అన్ని మార్కెట్లు దెబ్బతిన్నాయి. అందుకే కంపెనీలు తమ ఉత్పత్తులను జనాల వద్దకు చేరవేయడానికి వినూత్నంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. కానీ బాగా పాపులారిటీ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతున్నారు. దీంతో ఆ డబ్బు ఏదో ఇంకా వినూత్న విధానాల మీద ఖర్చు పెడితే బాగుంటుందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ సౌందర్య లేపనాల కంపెనీ ‘ఎస్టీ లాడర్’ వారు వినూత్న ప్రచారానికి పట్టం కట్టబోతున్నారు. వారు కొత్తగా ఆవిష్కరించబోతున్న ఫేస్ క్రీమ్‌ల ఫొటోషూట్ కోసం ఏకంగా అంతరిక్షాన్నే బ్యాక్‌గ్రౌండ్‌గా ఎంచుకున్నారు.
ఇందుకోసం నాసాతో రూ. 94 లక్షలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫేస్ క్రీమ్‌ను 10 బాటిళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు. అక్కడ ఉన్న వ్యోమగాములు ‘ఎస్టీ లాడర్’ వారి అడ్వాన్స్‌డ్ నైట్ రిపేర్ క్రీమ్‌ను పట్టుకుని ఫొటోలు దిగాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో భూమి కనిపించేలా ఈ ఫొటోషూట్‌ను కుపోలా కంట్రోల్ టవర్‌లో చేయాలి. ఆ తర్వాత ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఈ ఫొటోషూట్ పూర్తయ్యాక భూమ్మీదకి తిరిగి వచ్చిన 10 బాటిళ్లలో ఒక బాటిల్‌ను చారిటీ కోసం వేలం వేయనున్నారు. వర్జీనియాలోని వాలోప్ ఐలాండ్ నుంచి నార్త్‌రోప్ గ్రూమన్ అంటారేస్ రాకెట్ ద్వారా ఈ స్కిన్ సీరమ్‌ను అంతరిక్షానికి పంపించనున్నారు.