రూ. 150 కోట్లతో అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం

by Shyam |   ( Updated:2021-08-07 11:05:03.0  )
రూ. 150 కోట్లతో అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అనంతగిరి హిల్స్‌లో ఏర్పాటు చేయబోయే అడ్వెంచర్స్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకై రూపొందించిన పలు ప్రతిపాదనలను శనివారం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, టూరిజం అధికారులు సమీక్షించారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవిధంగా అభివృద్ధి చేయాలని టూరిజం అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని టూరిజం ఎండీ మనోహర్‌కి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమయ్యే రూ.150 కోట్లను పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 2000 మందికి పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
Advertisement

Next Story