- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతడే నా డ్రీమ్ డైరెక్టర్ : అదితి
దిశ, వెబ్‌డెస్క్: ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనే మాటకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదితి రావు హైదరి. హిందీ, తమిళ, తెలుగు, మళయాల చిత్రాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తను యాక్టింగ్ చేయడానికి స్ఫూర్తి ఎవరో, తన ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చాలా మంది హీరోలకు, హీరోయిన్లకు మణిరత్నం దర్శకత్వంలో చేయాలని ఉంటుంది. ఆ అవకాశాన్ని రెండు సార్లు అందిపుచ్చుకుని ‘కాట్రు వెలియిదయ్’(చెలియా), ‘చెక్క చివంత వానం’(నవాబ్) చిత్రాల్లో నటించింది అదితి. ఎంతమంది దర్శకులతో, ఎన్ని భాషల్లో పనిచేసినా, మణిరత్నమే తన ఫేవరేట్ దర్శకుడని తన మనసులో మాట బయటపెట్టింది అదితి.
‘మణి సార్ వల్లే నేను యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాను. నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారితో పరిచయాలు కూడా లేవు. నాకు నేను ఏదో ఒక రోజు మణిరత్నం సినిమాలో హీరోయిన్‌గా చేస్తానని నాకనిపించింది. అప్పటికి యాక్టింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా స్వీకరించాలనే ఆలోచన లేదు. కానీ, ఒక అంశం మరో దానికి దారీ తీసినట్లు సుధీర్ మిశ్రా యే సాలి జిందగీ, లండన్ పారిస్ న్యూయార్క్ సినిమాలు సైన్ చేసిన తర్వాత నాలోని నన్ను కనుగొన్నాను. 2010లో ముంబైకి వెళ్లాను. ఇక మణి సార్ అవకాశాలతో తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. తమిళ్, తెలుగు రెండు భాషలు అర్థమవుతాయి. తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాను. త్వరలోనే తమిళంలోనూ ఆ ఫీట్ సాధిస్తాను’ అని హైదరాబాదీ గర్ల్ అదితీ చెప్పుకొచ్చింది. 2020లో ‘వి’ మూవీతో హిట్ కొట్టిన అదితి, 2021లో ‘మహా సముద్రం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇక హిందీలో ‘ద గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమాతో పాటు, మరో సినిమా ఒప్పుకున్న ఈ యంగ్ బ్యూటీ, తమిళంలో ‘హే సినిమికా’ సినిమా చేస్తోంది.