మహాసముద్రంలో అందాల అదితి?

by Anukaran |
మహాసముద్రంలో అందాల అదితి?
X

అదితి రావు హైదారీ అందానికే అందం చిరునామా చెప్పినట్లుగా ఉంటుంది. రాజ్‌పుత్ కుటుంబం నుంచి వచ్చిన ఈ భామ రాకుమరిలా మెరిసిపోతూ ఉంటుంది. తెలుగులో ఓ అద్భుత కావ్యం లాంటి ‘సమ్మోహనం’ మూవీలో నటించి .. ఆహా ఇది కదా అందం అంటే అనిపించేలా చేసింది. మణిరత్నం లాంటి దర్శకుడినే మెప్పించిన అదితి..అందానికి టాలీవుడ్ కూడా దాసోహం అంటుంది.

ఇప్పటికే తెలుగులో తను నటించిన ‘వి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ భామ. తాజాగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహాసముద్రం’ సినిమాలో చాన్స్ కొట్టేసింది అదితి. శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్ టాక్. సిద్ధార్థ్‌కు జంటగా మరో హీరోయిన్‌ను ఫైనలైజ్ చేయాల్సి ఉండగా ఆ తర్వాత మహాసముద్రం‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, మలయాళీ మూవీ సోఫియుమ్ సుజాతమ్ చిత్రంతో హిట్ అందుకున్న అదితి..బాలీవుడ్ లో ది గాళ్ ఆన్ ది ట్రెయిన్, కోలీవుడ్‌లో హే సినామికా, తుగ్లక్ దర్బార్ , పొన్నియున్ సెల్వన్ మూవీలతో బిజీగా ఉంది.

Advertisement

Next Story