ఎంపీ సోయం బాపురావు లెటర్ ఫోర్జరీ

by Aamani |   ( Updated:2023-11-23 13:30:26.0  )
ఎంపీ సోయం బాపురావు లెటర్ ఫోర్జరీ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story