- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ఎందుకో తెలుసా ?
దిశ, ఖానాపూర్: సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం అవనున్న నేపథ్యంలో ఖానాపూర్ జడ్పీ పాఠశాలను అదనపు కలెక్టర్ బీ.హరిసింగ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అన్ని రకాల రికార్డ్స్, వివిధ ఉపాధ్యాయ కమిటీల ద్వారా ప్రత్యక్ష బోధనకి సిద్ధంగా ఉన్నారో లేదో తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు, మిగతా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రికార్డ్లు, ముందస్తు ప్రణాళిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
డెంగీ, కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థుల పట్ల జాగ్రత వహిస్తూ, ఏమాత్రం అనారోగ్య సూచన కనిపించినా వెంటనే తల్లిదండ్రులకు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది అప్పటికే పాఠశాలలో శానిటేషన్ పనులు చేస్తుండగా పరిశీలించారు. తరగతి గదులలో శానిటేషన్ మరియు బాత్రూంలలో శుభ్రత గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీఓ సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి సుప్రజ, ప్రధానోపాధ్యాయులు దూలం రాజేందర్, ఉపాధ్యాయులు డాక్టర్ గొడిశాల చంద్రమౌళి, రవీందర్, సరిత, మల్లయ్య, భారతి తదితరులున్నారు.