- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిఘి పోర్టులో భారీ పెట్టుబడులు పెట్టనున్న అదానీ సంస్థ!
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని దిఘి పోర్టును రూ. 705 కోట్లకు కొనుగోలు చేసినట్టు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ వెల్లడించింది. ఈ కొనుగోలు తర్వాత అదనీ పోర్ట్స్‌లో చేరిన 12వ పోర్టుగా దిఘి పోర్టు నిలిచింది. భవిష్యత్తులో ఈ పోర్ట్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లను పెట్టనున్నట్టు, జవహర్ నెగ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్‌పీటీ)కి ప్రత్యామ్నాయ గేట్‌వేగా మార్చనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడులతో దీన్ని మల్టీ కార్గో పోర్టుగా మార్చే ప్రయత్నాలు చేయనున్నట్టు, ప్రపంచ స్థాయిలో ప్రమాణాలు కలిగిన రోడ్డు, రైలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అదానీ పోర్ట్స్ పేర్కొంది. కాగా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భారత్‌లో అతిపెద్ద నౌకాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కంపెనీగా కొనసాగుతోంది. దేశీయంగా పోర్టుల సామర్థ్యంలో 24 శాతం వాటా కలిగిన 12 పోర్టులను కంపెనీ నిర్వహిస్తోంది.