ఫ్యాన్సీ రేటుకు ఆదాశర్మ ‘?’

by Shyam |   ( Updated:2020-12-18 05:38:13.0  )
ఫ్యాన్సీ రేటుకు ఆదాశర్మ ‘?’
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ ఆదాశర్మ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘?’(క్వశ్చన్ మార్క్) రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని తెలిపారు ఫిల్మ్ మేకర్స్. ఈ మధ్య రిలీజైన రామసక్కనోడివిరో సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. రఘు కుంచె సంగీతంలో మంగ్లీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాగా విప్రా దర్శకత్వంలో వస్తున్న సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాత కాగా.. సంజయ్, అభయ్, భానుశ్రీ ప్రధానపాత్రల్లో నటించారు.

Advertisement

Next Story