- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాల్దీవులు కాదు.. మహారాజపురం

దిశ, వెబ్‌డెస్క్: సినీ తారలంతా రిఫ్రెష్‌మెంట్ కోసం మాల్దీవులకు బాట పడుతున్నారు. అదా శర్మ మాత్రం ఇండియాలోనే ఎన్నో బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయంటూ వారికి చురకలంటించింది. షూటింగ్ కోసం అదాశర్మ తమిళనాడు-కేరళ సరిహద్దులోని మహారాజపురానికి వెళ్లింది. ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయిన ఈ భామ, ఆ గ్రామానికి సంబంధించిన కొన్ని వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
‘మాల్దీవులు కాదు..మహారాజపురం. అక్కడికి ఎలా వెళ్లాలని అడగకండి. ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి షూటింగ్‌లు జరగలేదు. నేను చాలా లక్కీ’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. అదా ప్రస్తుతం రెండు సినిమాల్లోనూ, ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై అదా శర్మ హీరోయిన్‌గా విప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ చిత్రంలోని ‘రామసక్కనోడివిరో’ అనే పాట ఇటీవలే విడుదలైంది.