'పరేషాన్' చేస్తున్న పావని.. అందాల అరబోత చూస్తే అంతే..!

by D.Reddy |   ( Updated:2025-02-20 13:20:14.0  )
పరేషాన్ చేస్తున్న పావని.. అందాల అరబోత చూస్తే అంతే..!
X

* టాలీవుడ్ నటి అందాలు ముద్దుగుమ్మ పావని కరణం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

* చిన్నాయనా.. అంటూ పుష్ప-2 మూవీలో అల్లు అర్జున్‌ అన్న కూతురుగా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిపోయింది.

* 2019లో జీ5లో 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

* 2023లో 'పరేషాన్' సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో 'సమోసా తింటావా శిరీష ' అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

* అయితే తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ హీరోయిన్‌గా అంతగా అవకాశాలు రాలేదు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. చివరకు పాన్ ఇండియా సినిమాలోనే ఆఫర్ కొట్టేసింది.

* పుష్ప-2లో కావేరి పాత్రలో కొద్దిసేపే కనిపించిన ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించింది.

* దీంతో ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. చిన్ననాయనా అంటూ.. అల్లు అర్జున్‌ను పిలుస్తూ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

* ఇక ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో అందాల విందు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed