గొప్ప మనసు చాటుకున్న నటి ‘షకీలా’.. నెటిజన్ల ప్రశంసలు

by Shyam |
గొప్ప మనసు చాటుకున్న నటి ‘షకీలా’.. నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా నటి షకీలా ప్రజలకు తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తు్న్న నిరుపేదలకు భోజనం అందించి వారి కడుపు నింపుతున్నారు. ఈ సందర్భంగా పేదలకు ఫుడ్ అందిస్తున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరూ ఆకలితో ఉన్న పేదలకు తమ వంతు సాయం అందించాలని షకీలా కోరారు.

Advertisement

Next Story