చైతుతో డైవోర్స్ ఇష్యూ.. అన్నీ సరిగ్గా ఉంటే ఎందుకు కాకూడదు? : సమంత

by Shyam |   ( Updated:2021-11-24 03:49:59.0  )
చైతుతో డైవోర్స్ ఇష్యూ.. అన్నీ సరిగ్గా ఉంటే ఎందుకు కాకూడదు? : సమంత
X

దిశ, సినిమా : ప్రస్తుతం బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత టైమ్ నడుస్తున్నట్లుగా ఉంది. చైతుతో డైవోర్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు బాధపడిన సామ్.. ఆ తర్వాత బిజీబిజీగా గడిపేస్తోంది. ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్ సినిమాలు చేస్తున్న తను.. బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు కూడా ఒకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ తాప్సీ పన్ను హోమ్ ప్రొడక్షన్‌లో ఆల్రెడీ ఓ సినిమాకు కమిట్ అయిందని, త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ టాపిక్‌పై స్పందించిన సామ్.. ఇందులో తప్పేముందని అభిప్రాయపడింది. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమా ఎందుకు చేయనని ప్రశ్నిస్తోంది. లాంగ్వేజ్ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదని.. స్క్రిప్ట్ అమేజింగ్‌గా ఉందా? క్యారెక్టర్‌కు జస్టిస్ చేయగలనా? అని నిర్ధారించుకున్నాక, ఓకే అనుకుంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానని చెప్పింది. ఇక ఈ స్టేట్‌మెంట్‌తో పక్కాగా బాలీవుడ్ సినిమా కమిటయ్యే ఉంటుందన్న అభిమానులు.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ప్రతీరోజు బిజీ బిజీగా గడుపుతూ సక్సెస్‌ఫుల్ ఉమన్‌గా రాణించాలని కోరుకుంటున్నారు.

చైతు బర్త్‌డేకు సమంత పర్సనల్‌గా మెసేజ్ చేసిందా?

Advertisement

Next Story