- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకుతో నగ్నంగా పోజిచ్చిన నటికి జైలు శిక్ష
దిశ, సినిమా : ఘనా దేశానికి చెందిన నటి రోజ్ మాండ్ బ్రౌన్(అకౌపెమ్ పొలూ) చేసిన పనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడునెలల జైలు శిక్ష విధించింది. గతేడాది జూన్‌లో తన కొడుకు 7వ పుట్టినరోజు సందర్భంగా.. నగ్నంగా ఉన్న తను న్యూడ్‌గా నిలబడ్డ కొడుకు చేతులు పట్టుకుని ఉన్న పిక్చర్ షేర్ చేసింది. ఈ ఫొటోపై ఘనా దేశవ్యాప్తంగా విమర్శలు రాగా, ఆ పోస్ట్ డిలీట్ చేసి కన్నీటి క్షమాపణలు చెప్పింది. కాగా ఈ పిక్చర్‌లో తల్లి అలా ఎందుకు చేస్తుందో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా నిలబడిన కొడుకును చూసి చలించిపోయిన ఇంటర్నేషనల్ చైల్డ్ వెల్ఫేర్‌తో పాటు పలు ప్రైవేట్ సంస్థలు ఈ ఘటనపై విచారణకు డిమాండ్ చేశాయి.
ఈ కేసు కోర్టులో విచారణకు రాగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీలతను ప్రచురించడం, గృహ హింస, మరొక వ్యక్తి గోప్యత, సమగ్రతను దెబ్బతీసినందుకు గాను తనను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఫొటోకు పోజ్ ఇచ్చేముందు కొడుకు అనుమతి తీసుకుందా? చిన్నారి హక్కును గౌరవించిందా? అని ప్రశ్నించారు జడ్జి. కఠినమైన శిక్ష ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తుందన్నారు. కాగా తాజా విచారణలో నటికి బెయిల్ మంజూరు అయింది.