పొలిటికల్ ఎంట్రీపై పవన్ హీరోయిన్ క్లారిటీ..

by Satheesh |   ( Updated:2022-03-29 13:31:25.0  )
పొలిటికల్ ఎంట్రీపై పవన్ హీరోయిన్ క్లారిటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్‌ రాజకీయ ప్రవేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించినా.. అవేవీ ఈ బ్యూటీకి కలిసిరాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమైన ఈ కన్నడ భామ.. పేదలకు సేవా కార్యక్రమాలు చేసి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కరోనా పరిస్థితుల్లో కూడా.. తన మంచి మనస్సుతో ఎంతోమంది పేదల ఆకలి తీర్చింది ఈ ముద్దుగుమ్మ.

తన పేరుమీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి, దానిద్వారా బెంగళూర్‌లో సేవలు అందిస్తున్న ప్రణీత.. లాక్‌డౌన్ సమయంలో నితిన్‌ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే, తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రణీత అభిమానులతో ముచ్చిటించింది. కాగా, ఓ నెటిజెన్ రాజకీయాలలోకి వెళ్లే ఆలోచన ఉందా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇచ్చిన ప్రణీత' రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు' అని తెలిపింది. ప్రణీత సేవా కార్యక్రమాలు చేసి.. అనంతరం రాజకీయాల్లోకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ప్రణీత వాటన్నింటికి తాజాగా చెక్ పెట్టింది.

Advertisement

Next Story