రాసలీలల మాజీమంత్రి.. జైలులోనూ వారిని మచ్చిక చేసుకుని..

by Anukaran |   ( Updated:2021-06-30 02:17:55.0  )
Actress Chandini -manikandan Case
X

దిశ, వెబ్‌డెస్క్: నటి చాందినీని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకొంటానని మోసం చేసిన మాజీ మంత్రి (అన్నాడీఎంకే) మణికంఠన్‌ ఇటీవల పోలీసులు చిక్కిన విషయం తెలిసిందే. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నై సైదాపేట సబ్‌ జైలుకు తరలించారు. అయితే అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని మాజీమంత్రి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు జైళ్లశాఖ ఇంటెలిజెన్స్‌ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం జైల్లో తనిఖీలు జరిపిన అధికారులు ఆయన సౌకర్యవంతమైన జైలు జీవితాన్ని భగ్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అన్నాడీఎంకే పార్టీ హాయంలో మణికంఠన్, పర్యాటకాభివృద్ధి పనుల నిమిత్తం నటి చాందినీని పలుమార్లు కలిసాడు. తన భార్యతో తనకు పడడం లేదని, కల్లబుల్లి కబుర్లు చెప్పి చాందినీకి దగ్గరయ్యాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భవతి అయితే బలవంతంగా రెండు సార్లు అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడిపోయిన చాందినీ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాలీని స్వయంగా కలిసి మణికంఠన్‌పై ఫిర్యాదు చేశారు.

నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మణికంఠన్ ని వారం రోజుల క్రితం అరెస్ట్‌ చేసి సైదాపేట సబ్‌ జైల్లో పెట్టారు. అక్కడ జైలు అధికారులను మచ్చిక చేసుకొని జైలు గదిలోనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ మంత్రి మణికంఠన్‌ రూంలో ఎయిర్‌కూలర్, మెత్తని పరుపు, దిళ్లు, సువాసన వెదజల్లే బాటిళ్లు గుర్తించారు. అంతేగాక చార్జర్‌ సౌకర్యంతో సెల్‌ఫోన్‌ను ఉండటాన్ని గమనించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న అధికారులు మణికంఠన్‌ను వెంటనే చెన్నై పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలులో మణికంఠన్ కి సహాయం చేసిన అధికారులపై విచారణ చేపట్టినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed