- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మల్టీటాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ ఉమెన్
దిశ, ఫీచర్స్ : ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఒకే ఒక్క చాన్స్‌తో ఆకాశమంత ఫేమ్ పొందొచ్చు. అంతలోనే అధ:పాతాళానికి పడిపోవచ్చు. ప్రత్యేకించి హీరోయిన్స్ విషయానికొస్తే వారి కెరీర్ స్పాన్ చాలా తక్కువ. బాలీవుడ్‌లో పరిస్థితి వేరుగా ఉన్నా, ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం ఓ పది సినిమాలు చేశారంటే చాలు ఫేడ్‌అవుట్ అయిపోతుంటారు లేదా కెరీర్ మొదట్లో రెండు, మూడు ఫ్లాప్‌లు వరుసగా పలకరించాయా? ఇక అంతే సంగతులు. ఈ లెక్కన ప్రతీ పది మంది హీరోయిన్లలో ఇద్దరు మాత్రమే సర్వైవ్ కాగలిగే పరిస్థితులున్నాయి. ఇందుకు సెలబ్రిటీల వారసులు కూడా అతీతం కాదు. తమకున్న బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినా, వీరిలో చాలా మంది ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. ఫెయిల్యూర్స్ చవి చూడగానే, ఇది వర్కవుట్ కాదని గ్రహించి ఇతర నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ మేరకు ఆల్టర్నేటివ్ కెరీర్స్‌పై దృష్టి సారించి.. రైటర్, బిజినెస్ ఉమన్, సోషల్ వర్కర్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా రాణిస్తున్నారు. అలాంటి మల్టీటాలెంటెడ్ స్టార్ ఉమెన్‌పై స్పెషల్ ఫోకస్..
ట్వింకిల్ ఖన్నా :
ఫేమస్ సెలబ్రిటీస్ రాజేశ్ ఖన్నా, డింపుల్ కంపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నా..‘బర్సాత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు గాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్, గోవింద, అక్షయ్ కుమార్‌తో పలు చిత్రాల్లో నటించింది. ఇక టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘శీను’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా నటించింది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న క్రమంలోనే తనలో ఓ రైటర్ ఉందని గ్రహించిన ట్వింకిల్.. ఖిలాడీ అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో రైటర్‌గా ఆమె రచించిన ‘మిస్సెస్ ఫన్నీబోన్స్(MrsFunnybones)’ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. ఇదేగాక ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మిప్రసాద్, పైజామాస్ ఆర్ ఫర్‌గివింగ్(నావెల్)’ వంటి తన రచనలు రీడర్స్‌ను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇంటీరియర్ డిజైనర్‌గా, పత్రికా కాలమిస్ట్‌గా కూడా పనిచేస్తున్న ట్వింకిల్.. మరోవైపు తనకు నచ్చిన, కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.
సుష్మితాసేన్ :
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ షుబీర్ సేన్, ఫ్యాషన్ డిజైనర్ శుభ్రాసేన్‌ల కూతురు సుష్మితాసేన్.. ఇండియా నుంచి ‘మిస్ యూనివర్స్’ టైటిల్ దక్కించుకున్న తొలి మహిళ. హైదరాబాద్‌లో పుట్టిన సుష్మితా సేన్ విద్యాభ్యాసం మాత్రం ఢిల్లీలో జరిగింది. మహేశ్‌భట్ ‘దస్తక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుష్మిత నటనకు ఇండస్ట్రీ నుంచి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. తొలి సినిమాలోనే ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించినా, అవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో లీడ్ రోల్స్ నుంచి సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా మారి పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సుష్మిత కొంతకాలం నటనకు దూరంగా ఉంది. ఆ తర్వాత ‘తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు ఇటీవలే ‘ఆర్య’ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి, టాలెంట్ నెవర్ ఫేడ్ అవుట్స్ అని నిరూపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్.. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుండగా, ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
శిల్పాశెట్టి :
‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శిల్పాశెట్టి.. ప్రస్తుతం ఫిట్‌నెస్ ఫ్రీక్, డ్యాన్సర్, ఆథర్, బిజినెస్ ఉమన్‌గా రాణిస్తోంది. ఫార్మసూటికల్ ఇండస్ట్రీ బిజినెస్ మాగ్నెట్స్ సురేంద్ర శెట్టి, సునంద్ర శెట్టిల కూతురైన శిల్ప.. బీటౌన్‌లో హీరోయిన్‌గా తనదైన విలక్షణతను చాటుకుంది. టాలీవుడ్ ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో సాగరకన్యగా ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూనే.. సోషల్ వర్కర్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆల్టర్నేట్ కెరీర్‌పై దృష్టి సారించింది. సినిమాలకు బ్రేక్ ఇస్తూ డ్యాన్స్ రియాలిటీ షోస్‌కు జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, రైటర్, సామాజిక కార్యక్రమాల ప్రచారకర్తగా పనిచేస్తూ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. న్యూట్రీషియస్ ఫుడ్, హెల్తీనెస్ కోసం ఏం చేయాలి? వంటి విషయాలను వివరిస్తూ ‘ద డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా, ద గ్రేట్ ఇండియన్ డైట్’ పేరిట రెండు బుక్స్ కూడా రాసిన శిల్ప.. సోషల్ మీడియా వేదికగా తరచూ ఫిట్‌నెస్ టిప్స్, యోగాసనాల గురించి వివరిస్తుంటుంది.
ప్రీతి జింటా :
సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్ ప్రీతి జింటాకు హిందీ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు ఉంది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ దుర్గానంద్ జింటా, నిల్‌ప్రభ దంపతుల కూతురు ప్రీతి ‘దిల్ సే’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలో తెలుగు, పంజాబీ, ఇంగ్లిష్ సినిమాల్లో నటించిన ప్రీతి.. టాలీవుడ్‌లో మహేశ్‌బాబు, వెంకటేశ్‌తో పాటు బాలీవుడ్‌లో చాలామంది హీరోలకు జోడీగా నటించింది. ప్రీతి నటించిన చిత్రాలు కమర్షియల్‌గానూ మంచి సక్సెస్ అందుకోగా.. తనకు ఆఫర్స్ తగ్గుతున్న దశలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. అంతేకాదు పీజెడ్ఎన్‌జెడ్ మీడియా, ఐపీఎల్ క్రికెట్ టీమ్ పంజాబ్ కింగ్స్ కో-ఓనర్‌గా, సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా ముందుకు సాగుతోంది.