- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నియంత పాలనతోనే మార్పు : విజయ్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రాజకీయాలపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్ చేశారు. తనకు పాలిటిక్స్‌పై ఆసక్తి లేదన్న విజయ్, చాలా మంది ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరని కామెంట్స్ చేశారు. దేశంలో డబ్బు, లిక్కర్ కోసం ఓటును అమ్ముకున్నన్ని రోజులు అభివృద్ధి శూన్యం అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు పెట్టే ప్రలోభాలకు గురై ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండరాదన్నారు.
అలాగే, ధనవంతులకు కూడా ఓటు హక్కుతో పనిలేదన్నారు. కేవలం చదువుకున్న వారికి మాత్రమే ఓటు విలువ తెలుస్తుందని.. అలాంటి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని వెల్లడించాడు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావడం కష్టమని విజయ్ అభిప్రాయం వ్యక్తంచేశాడు. డిక్టేటర్ షిప్‌లో అయితే మార్పు రావొచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, రౌడీ విజయ్ కామెంట్స్‌ను కొందరు సపోర్టు చేస్తుండగా, మరికొందరు మండిపడుతున్నారు.