‘కంగనా రాణీ లక్ష్మీబాయి అనిపించుకుంది’

by Shamantha N |
‘కంగనా రాణీ లక్ష్మీబాయి అనిపించుకుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని బాలీవుడ్ నటీ కంగనా రనౌత్‌పై మహారాష్ట్ర హోంశాఖ మంత్రి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముంబై పోలీసులకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ధైర్య సాహసాలను పలువురు నటులు ప్రశంసిస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్‌పై కంగనపై శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక్క సినిమా కంగనాను రాణీ లక్ష్మీబాయి అనుకునేలా చేసిందన్నారు. అంతేగాకుండా పద్మావతి పాత్రలో దీపికా, అక్బర్‌గా హృతిక్, అశోకుడిగా షారూఖ్, భగత్‌సింగ్‌గా అజయ్ దేవ్‌గణ్, మంగళ్‌పాండేగా అమీర్‌ఖాన్, మోడీ వివేక్ నటించారన్నారు.

Advertisement

Next Story

Most Viewed