- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడికి రెండో భార్య విడాకులు.. పెళ్లై ఎనిమిదేళ్లయినా ఇంకా
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటీనటులు.. సెలబ్రిటీలు విడాకులు తీసుకోవటం కొత్తేం కాదు. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం.. కష్టమైతే వీడిపోవడం సాధారణమైపోయింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు మా ఇద్దరికీ సఖ్యత కుదరడంలేదని, ఇద్దరి అంగీకారంతోనే విడిపోయామని ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఇక తాజాగా పాపులర్ మలయాళ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడిపోతున్న వార్తలు ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి. మలయాళ నటుడు, రాజకీయ నేత ముఖేశ్, నటి సరిత తో విడిపోయి 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో నటి సరిత భర్తపై చేసిన ఘాటు ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
తన భర్త తాగుబోతని, చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని తెలుపుతూ మీడియా ముందే అతనిని ఏకిపారేసింది. ఈ గొడవల నేపథ్యంలోనే 2011 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.. విడాకులు తీసుకున్న రెండేళ్లకు ముఖేశ్ డ్యాన్సర్ మెతిల్ దేవికను పెళ్లాడారు.
ఇక మెతిల్ దేవిక డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత వీరిద్దరి కాపురం అన్యోన్యంగానే సాగిందని, మాలీవుడ్ లో బెస్ట్ జోడిలలో వీరు ఒకరని అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే, సడెన్ గా మెతిల్ దేవిక తన భర్త తో విడిపోతున్నానని మీడియా ముందు చెప్పి షాక్ కి గురిచేసింది. అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయని చెప్పింది.
“ముఖేశ్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడు. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. అతడి పరువు తీయాలని నేను అనుకోవటం లేదు. రాజకీయ నాయకుడిగా.. నటుడిగా అతడి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించే అవసరం కూడా నాకు లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించే అవసరం.. ఆసక్తి నాకేమాత్రం లేదు. అలా అని, అతడు నన్ను హింసించాడు, వేధించాడు అని కూడా చెప్పడం లేదు. ఇదేదో కోపంలోనో, ఆవేశంలోనో తీసుకున్న నిర్ణయం కాదు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విడాకుల విషయంలో తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ముఖేష్ చెప్పడం గమనార్హం. ఇక దేవిక నిర్ణయంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. విడిపోవడానికి అర్ధం కాకపోవడం కూడా కారణమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.