- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన నటుడు
దిశ, సినిమా: కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. ‘యువరత్న’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్.. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న జనాలకు హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అంబులెన్స్ సేవలు ప్రారంభించిన అర్జున్.. అవసరంలో ఉన్న వారిని హాస్పిటళ్లకు తరలించేందుకు, కరోనాతో చనిపోయిన పేషెంట్స్ అంత్యక్రియలు జరిపించేందుకు ఈ ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపాడు.
ఇప్పటికే ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు రోడ్డు మీదకు వచ్చానని తెలిపిన అర్జున్.. ఆరుగురికి అంత్యక్రియలు జరిపించానని తెలిపాడు. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ మతానికి చెందిన వారు? అనే విషయాలను పట్టించుకోకుండా హెల్ప్ చేస్తానన్న నటుడు.. ఇందుకోసం బెంగళూరు టౌన్ వ్యాప్తంగా ట్రావెల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాడు. పరిస్థితి చాలా బ్యాడ్‌గా ఉందని, తన సహాయ కార్యక్రమాలు మరికొన్ని నెలలు కొనసాగుతాయని చెప్పాడు. తనకు వీలైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని పేర్కొన్నాడు.