- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామోజీ ఫిలిం సిటీ కార్మికుల కోసం…
దిశ, రంగారెడ్డి: రామోజీ ఫిలిం సిటీ కార్మికులకు, అన్ని తరగతుల ఉద్యోగస్తులకు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీలో అన్ని తరగతుల కార్మికులు, ఉద్యోగులు సుమారు 5 వేల మంది ఉంటారని.. వారికి సుమారు రూ. 5 కోట్లకు పైగా ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, యాజమాన్యం కరోనాను సాకుగా చూపించి జీతాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఏప్రిల్ నెల జీతం ఇప్పటివరకూ కార్మికులకు చెల్లించలేదన్నారు. ఆ సంస్థలో పనిచేసే కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేశారని, ఆ సంస్థకు లాభాలు వచ్చినప్పుడు ఫిలిం సిటీ యాజమాన్యం అనుభవించి లాక్ డౌన్ కాలంలో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే జీతాలకు డబ్బులు లేవని చెప్పడం అన్యాయమని అన్నారు. అదేవిధంగా ఫిలిం సిటీలో పనిచేసే కార్మికులకు యాజమాన్యం పని లేదని చెప్పి కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ యాజమాన్యం చట్ట విరుద్ధంగా కార్మికులను తొలగించే ప్రక్రియను అడ్డుకోవాలని అన్నారు.