నేరం చేయడానికి వచ్చినా.. వీటిని చూస్తే జంకుతారు : ఏసీపీ

by Shyam |   ( Updated:2021-10-11 05:39:50.0  )
ACP Raghu Chander
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: నేర రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ రఘు చందర్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ… నేర రహిత సమాజమే లక్ష్యంగా పని చేస్తోన్న పోలీసులకు సీసీ కెమెరాలు మరింత తోడ్పాటు అందిస్తాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇండ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని మూలంగా దొంగతనాలను నివారించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఒకవేళ నేరం చేయడానికి వచ్చినా.. సీసీ కెమెరాలను చూస్తే విరమించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామాల్లో సైతం కెమెరాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. సర్పంచ్ కొంగరి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ వంశీ, సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్ఐలు మహేందర్, కమలాకర్, గ్రామస్తులు మాధవరెడ్డి, రంజిత్ రెడ్డి, రాజేందర్, మల్లారెడ్డి, శ్రీను, ఆర్‌జీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed