రాజు మృతదేహాన్ని అప్పుడే అప్పగిస్తాం : వరంగల్ ఏసీపీ గిరిధర్

by Shyam |   ( Updated:2021-09-16 07:16:29.0  )
ACP Giridhar, Raju Postmortem
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్/పోచ‌మ్మమైదాన్: వ‌రంగ‌ల్ ఎంజీఎం పోస్టుమార్టం గ‌దిలో ఉన్నది మా రాజు శ‌వమేన‌ని బంధువులు గుర్తించారు. గురువారం సైదాబాద్ నుంచి కొంత‌మంది, వ‌రంగ‌ల్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన మ‌రికొంత‌మంది రాజు బంధువులు ఎంజీఎం పోస్టుమార్టం గ‌ది వ‌ద్దకు చేరుకున్నారు. మృత‌దేహంపై ఉన్న ప‌చ్చబొట్టు, టాటూల ఆధారంగా చ‌నిపోయింది రాజు అనే గుర్తించారు. ఈ సంద‌ర్భంగా వరంగల్ ఏసీపీ గిరిధర్ కలకోట మాట్లాడుతూ.. పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బంధువుల‌కు మృత‌దేహాన్ని అప్పగించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పోస్టుమార్టం వ‌ద్దకు రాజు తరుపు బంధువులు మాత్రమే హాజ‌రు కాగా అత‌డి భార్య తరుపున ఎవ్వరూ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా, రాజు మృత‌దేహాన్ని ఎంజీఎం పోస్టుమార్టం గ‌దిలోకి తీసుకెళ్తున్న స‌మ‌యంలో ఓ వ్యక్తి చెప్పుల‌తో దాడి చేసేందుకు య‌త్నించాడు. పోస్టుమార్టం సిబ్బంది, పోలీసులు వెంట‌నే అప్రమ‌త్తమై అక్కడి నుంచి అత‌డిని లాక్కెళ్లారు.

Advertisement

Next Story