- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్డెన్ సెర్చ్.. నెక్కొండను జల్లెడ పట్టిన పోలీసులు
దిశ, నెక్కొండ: నర్సంపేట ఏసీపీ ఫణిదర్ నేతృత్వంలో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా నెక్కొండ మండల కేంద్రంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లీ గల్లీని పోలీసులు జల్లెడ పట్టినట్లు తనిఖీలు చేశారు. అనంతరం నెక్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ ఫణిదర్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని హెచ్చరించారు. గ్రామాల్లోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
యువత వాహనాలను పరిమిత వేగంలో వెళ్లి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్ వాహనాలకు చలాన్లు విధించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో నర్సంపేట SHO కరుణసాగర్ రెడ్డి, నెక్కొండ సీఐ తిరుమల్, దుగ్గొండి సీఐ సతీష్ బాబు, ఖానాపురం ఎస్ఐ సాయిబాబా, ఆత్మకూరు ఎస్ఐ రాజన్ బాబు, నెక్కొండ ఎస్ఐ నాగరాజు, దుగ్గొండి ఎస్ఐ నవీన్ కుమార్, నర్సంపేట ఎస్ఐ రవీందర్, నెక్కొండ ఏఎస్ఐ వేణుగోపాల్, వివిధ మండలాల కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.