నీలాంబరి, చిట్టిబాబు.. ఆ కెమిస్ట్రీనే వేరప్పా

by Shyam |   ( Updated:2021-11-05 04:02:38.0  )
నీలాంబరి, చిట్టిబాబు.. ఆ కెమిస్ట్రీనే వేరప్పా
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలో చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించగా.. వీరిద్దరిపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మణిశర్మ స్వరపరిచిన పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక పాటలో చెర్రీ, పూజ పర్‌ఫార్మెన్సెస్ విషయానికొస్తే.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. రాంచరణ్ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌కు తోడు పల్లెటూరి అమ్మాయిగా పూజ అమాయకత్వం నిండిన చూపులు ప్రేక్షకులను మ్యాజిక్ చేస్తున్నాయి. గతంలో చరణ్ చిట్టిబాబు పాత్ర పోషించిన ‘రంగస్థలం’ చిత్రంలోని ఐటెం సాంగ్‌లో దుమ్ములేపిన పూజ.. ఈసారి మాత్రం రొమాంటిక్ మెలోడీకి ప్రాణం పోసింది.

చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా.. పూజ ‘రాధేశ్యామ్’తో పాటు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’, సల్మాన్‌తో ‘భాయిజాన్’, విజయ్‌తో ‘బీస్ట్’ తదితర సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

Next Story