మెగా సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు హోళీ గిఫ్ట్

by Shyam |
మెగా సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు హోళీ గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆచార్య … మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం. కోరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను అనుకోకుండా చెప్పేశారు చిరు. ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరు సినిమా పేరు నోరు జారారు. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కీలక పాత్రపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొరటాల ముందుగా రామ్ చరణ్‌ను తీసుకున్నాడని.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ పాత్ర కాస్త మహేష్ బాబు చేస్తున్నాడని సమాచారం. అయితే ఈ పాత్ర ఎవరు చేస్తున్నారనే కన్ఫ్యూజన్ నుంచి బయటపడేసేందుకు… ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మూవీ యూనిట్. మార్చి 8 హోళీ రోజున ‘ఆచార్య’ ప్రాజెక్టులో మహేష్ బాబు పాత్ర గురించి ప్రకటన విడుదల చేయనుందట.

ఇదిలా ఉంటే మహేష్ ఈ సినిమాలో నక్సలైట్ లేదా విద్యార్థి నేతగా కనిపించనున్నాడని తెలుస్తోంది. 30 నిమిషాల పాత్ర కోసం రూ. 35-40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. మహేష్‌కు జంటగా పూజా హెగ్డే లేదా సాయి పల్లవిని తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. కొణెదెల ప్రొడక్షన్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed