నక్సలైట్లుగా మారిన తండ్రీకొడుకు

by Anukaran |   ( Updated:2021-03-26 23:17:49.0  )
నక్సలైట్లుగా మారిన తండ్రీకొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా.. విషెస్ చెబుతూ మేకర్స్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR సినిమాలోని రాంచరణ్ పోస్టర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

https://twitter.com/RRRMovie/status/1375397396520206350

ఈ క్రమంలో తాజాగా ఆచార్య సినిమా నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఇందులో చిరు, రాంచరణ్ తుపాకీలు పట్టుకుని నక్సలైట్ పాత్రలలో సీరియస్ లుక్‌లో కనిపించారు. తండ్రీకొడుకు నల్లప్యాంటు, నల్లచొక్కా వేసుకుని విభిన్న లుక్‌లో కనిపించారు. చిరు, రాంచరణ్ ఒకే పోస్టర్‌లో కనిపించడంతో.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Advertisement

Next Story