'ఆచార్య' కోసం కాజల్ భారీ రెమ్యునరేషన్

by Shyam |
ఆచార్య కోసం కాజల్ భారీ రెమ్యునరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టూడెంట్ లీడర్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. అయితే చిరుకు జోడిగా సెలెక్ట్ అయిన త్రిష పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించగా.. ఆ క్యారెక్టర్ గురించి అందాల చందమామ కాజల్‌ను సంప్రదించారట డైరెక్టర్. కానీ ఇందుకోసం కాజల్ రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. చాలా చర్చల తర్వాత చివరికి కోటిన్నరతో సరిపెట్టుకుందట. ‘ఖైదీ నం.150’లో చిరుతో తొలిసారి ఆడిపాడిన భామ ఇప్పుడు మరోసారి స్టెప్పులు వేయబోతోంది. దీంతో ఈ జంటను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కాజల్ ‘ఆచార్య’ షూటింగ్‌లో జాయిన్ కాబోతోందని సమాచారం.

Tags : Acharya, Kajal Agarwal, Remuneration, Mahesh Babu

Advertisement

Next Story

Most Viewed