కరోనా ఎఫెక్ట్ .. 'ఆచార్య' కూడా వెనక్కి తగ్గిందిగా!

by Shyam |   ( Updated:2021-04-27 00:49:05.0  )
కరోనా ఎఫెక్ట్ .. ఆచార్య కూడా వెనక్కి తగ్గిందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కరాళ నృత్యం చేస్తుంది. చిత్ర పరిశ్రమ ఈ మహమ్మారి దెబ్బకు మరోసారి కుదేలవుతోంది. ఇప్పటికే కరోనా వలన విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే షూటింగులు సైతం నిలిపివేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మే నెలలో విడుదల కావాల్సిన సినిమాలను చిత్ర నిర్మాతలు వాయిదా వేశారు. చిరంజీవి – కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ కు సైతం కరోనా దెబ్బ తగిలింది. మే 13 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేసారు.

” కరోనా కారణంగా ‘ఆచార్య’ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాం.. అందరు మాస్క్ ధరించండి.. సేఫ్ గా ఉండండి” అంటూ కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. అయితే కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడ్డ అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొంత రిలీజ్ డేట్ చెప్పాలని నిర్మాతలను కోరుతున్నారు.

Advertisement

Next Story