- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నల్లమల్ల వాసికి జాతీయ పురస్కారం
దిశ, అచ్చంపేట: నల్లమల్ల ప్రాంతంలోని పదర మండలంలోని ఓ కుగ్రామమైన ఉడిమిల్లాకు చెందిన యువ కవి, రచయిత పోతుల వెంకటేశ్ ను జాతీయ పుడమి సాహితీ వేదిక అవార్డుకు ఎంపిక చేసినట్లు నల్లగొండ జిల్లా సాహితీ పుడమి వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి తెలిపారు. సాహితీ వేదిక వారు ప్రతి ఏడాది వివిధ రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు అందించే ఈ అవార్డును 2020 సంవత్సరానికి గాను నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన పోతుల వెంకటేశ్ ఎంపికవడం హర్షించదగ్గ విషయమమంటూ నల్లమల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాహితీ రంగంలో వెంకటేష్ అనేక రచనలు చేస్తూ సాహితీరంగంలో రాణించడం ఈ ప్రాంతానికి గర్వకారణమంటున్నారు. ఆగస్టు 5వ తేదీన నల్లగొండ జిల్లా నడిగూడెం రాజావారి కోటలో జరిగే ఈ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఉస్మానియా విద్యార్థి యువ కవిగా మరిన్ని అవార్డు అందుకొని నల్లమల్ల ప్రాంతాన్ని గర్వపడేలా విజయాలు సాధించాలని బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు, మండల ప్రజలు కోరుకుంటున్నారు.