- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండ్రోజులు గడిచాకే చెప్పగలం : వైద్యులు
దిశ, వెబ్‌డెస్క్ : తన ప్రేమను నిరాకరించిందని ఇంజినీరింగ్ విద్యార్థి తేజస్వినిపై కత్తితో దాడి చేయడమే కాకుండా, తనను తాను గాయపరుచుకున్న నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. బెజవాడలోని మాచవరంలో గురువారం ఉదయం ఈ ఘటన జరగగా.. దాడి చేసిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించేందుకు విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
అతన్ని పరీక్షించిన వైద్యులు పొట్ట, గొంతు, చేతిపై కత్తితో బలంగా గాయపరుచుకున్నాడని నిర్ధారించారు. మూడు చోట్ల తీవ్రగాయాలు కావడంతో పాటు అతని బీపీ లెవల్స్ తగ్గిపోయాయని జీజీహెచ్ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. తదుపరి పరీక్షలు చేయాలంటే బీపీ లెవల్స్ నార్మల్ కావాలని.. అందుకోసం మరో రెండ్రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లడించారు. ఇదిలాఉండగా, ఈ ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన తేజస్విని మృతిచెందగా.. ఆమె కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు.