- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలపగిలి రక్తమోడుతున్నా.. పైశాచికంగా అత్యాచారం
దిశ, మహబూబాబాద్ : మరిపెడ మండలంలోని బాలికపై జరిగిన హత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బాలికను దారుణంగా అత్యాచారం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. కేవలం మూడు నెలల పరిచయంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తల పగిలి రక్తమోడుతున్నా.. కనికరం చూపకుండా రాక్షసుడిలా మీదపడి అత్యాచారానికి పాల్పడ్డాడీ కీచకుడు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాంపురం తండాకు చెందిన బాలికకు సమీప తండాకు చెందిన ధరంసోత్ రాజేష్‌కు మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. పక్కపక్క తండాలు కావడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో ఇద్దరం శారీరకంగా కలుద్దామని రాజేశ్ గత కొద్దిరోజులుగా బాలికను వేధిస్తున్నాడు. ఈనెల 29న ఇంట్లో ఎవరు లేరని, తండా సమీపంలోని మొండికట్టు బోడు(గుట్ట)కు రావాలని బాలికను కోరాడు.
అక్కడికి వెళ్లిన బాలికను రాజేశ్ బండరాయి మీద కూర్చోబెట్టాడు. అలా ఇద్దరు మాట్లాడుతూ బాలికను శారీరకంగా కలుద్దామని రాజేశ్ బలవంతం చేశాడు. దానికి ఆమె ఒప్పుకోకపోయినా బలవంతంగా లైంగిక దాడి చేస్తుండగా.. గట్టిగా అరుస్తూ అతడి పట్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. రాజేశ్ వినకుండా ఆమెను బలవంతంగా పైకి లేపుతున్న క్రమంలో బండకు తల బలంగా తాకింది. దీంతో తలపగిలి తీవ్ర రక్తస్రావం అయింది. అయినా రాజేశ్ అవేమి పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారం కొనసాగించాడు.
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న రాజేష్.. విషయాన్ని శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు బాలిక బావ అయిన శంకర్‌కు సమాచారం అందించాగా.. అతడు ఘటన స్థలానికి వెళ్లి బాలికను పురుషోత్తమాయగూడెంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే బాలిక చనిపోయినట్లుగా డాక్టర్ ధ్రువీకరించాడు. కాగా, ఘటన స్థలం నుంచి పరారైన రాజేష్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఆదివారం ఎల్లారిగూడెం స్టేజ్ వద్ద వాహనాలు తనిఖీల్లో పట్టుపడ్డాడు. నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్ ఫొన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.