పరిగి ఎన్‌ఆర్‌ఈ‌జిఎస్‌ ఆఫీసులో ఏసీబీ రైడ్స్

by Sumithra |
పరిగి ఎన్‌ఆర్‌ఈ‌జిఎస్‌ ఆఫీసులో ఏసీబీ రైడ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్‌ కార్యాలయంలో రైడ్స్ నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి ఎంపీడీఓ సుభాష్ గౌడ్‌ రూ. రెండు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం.. లంచం తీసుకుంటున్న సమయంలో మెరుపు దాడి చేసిన అధికారులు.. ఈసీ రఫీ, టెక్నిక్ అసిస్టెంట్‌‌లను పట్టుకున్నారు. ఎంపీడీఓ సుభాష్ గౌడ్‌ టీమ్‌లో మొత్తం 8 మంది ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed