ఆడియో టేపులు ముందుంచి విచారణ

by Shyam |
ఆడియో టేపులు ముందుంచి విచారణ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అవినీతి కేసును ఏసీబీ అధికారులు రెండోరోజు మంగళవారం విచారించారు. మొత్తం ఐదుగురిని రిమాండ్ చేయగా బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు. వీరందర్నీ వేర్వేరుగా విచారిస్తున్నారు. లంచంగా తీసుకున్న రూ.40లక్షల వ్యవహారంపైనే ఏసీబీ అనేక ప్రశ్నలు వేసినప్పటికీ, ఈ కేసుతో నాకేం సంబంధం లేదన్నట్టుగానే సమాధానం చెబుతున్నట్టుగా సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ మాట్లాడిన ఆడియో టేపులు, అగ్రిమెంట్లు, ఆస్తి పత్రాలను ముందుంచి ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ అయ్యే అవకాశం ఉన్న నేనెందుకు అవినీతికి పాల్పడతానంటూ ఏసీబీ అధికారులనే బుకాయించినట్టుగా సమాచారం. ఈ కేసులో కోలా జీవన్ గౌడ్ అనే వ్యక్తిని ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ బినామీగా గుర్తించగా, తాజాగా మరో ముగ్గురు బినామీలను ఏసీబీ గుర్తించి విచారించింది. అందులో ఓ మహిళతో పాటు సమీప బంధువులు కీలకపాత్ర పోషించినట్టు సమాచారం.

Advertisement

Next Story