ఆ సీఐ లాకర్‌లో ఎంత డబ్బుందంటే?

by Sumithra |   ( Updated:2020-11-25 09:09:54.0  )
ఆ సీఐ లాకర్‌లో ఎంత డబ్బుందంటే?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన సీఐ జగదీశ్ కేసు మరో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లో గల యాక్సిస్ బ్యాంక్‌లో జగదీశ్ భార్య పేరుమీద ఉన్న లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచారు. అందులో రూ.34,40,200 నగదు, రూ.9,12,800 విలువైన 182.560 గ్రాముల బంగారు అభరాణాలు, రూ.1,020 విలువైన 157 గ్రాముల విలువైన వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు పలు భూములకు సంబంధించిన పట్టా, పాస్‌బుక్‌లు, రిజిస్ర్టేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే వ్యవసాయ భూములు, భూములకు సంబంధించిన దస్తావేజుల వివరాలను ఏసీబీ అధికారులు బహిర్గతం చేయలేదు. కానీ వికారాబాద్‌లో జగదీశ్‌కు చెందిన భూముల విలువ కోటికిపైన ఉంటుందని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసినప్పుడు జగదీశ్ బలవంతపు వసూళ్లు లక్షల్లో ఉన్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. కాగా జగదీశ్‌ను అవినీతి ఆరోపణల కారణంగా ఈ నెల 21న ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed