- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మనసు మారాలని.. విద్యార్థుల అర్దనగ్న ప్రదర్శన
దిశ, మహేశ్వరం: విద్యార్థుల భవిష్యత్ గురించి మంత్రి సబితాఇంద్రారెడ్డి మరోసారి పునరాలోచన చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో మంత్రి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అర్దనగ్న ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కందాడి శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనస్సు మార్చుకొని మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీ కాలేజ్ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం డిగ్రీ కాలేజ్‌ను బడంగ్‌పేట్‌కు మార్చడం మూలంగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని సుమారు 70 గ్రామాల విద్యార్థులు డిగ్రీ చదువుకోవడానికి హైదారాబాద్ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
తక్షణమే మహేశ్వరం కేంద్రంలోనే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యా వనరుల కేంద్ర కార్యాలయాలలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ శివకుమార్, అనిల్, సిగ్గు యశ్వంత్, సాయికిరణ్, శ్రీకాంత్, రాకేష్, చరణ్ తేజ్, సుధీర్ సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.