- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ కోసం గ్యాంగ్ అంతా వెయిటింగ్ : అభిషేక్ సోదరి
బచ్చన్ కుటుంబాన్ని కరోనా కలవరపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా కరోనా బారినపడ్డారు. అయితే బిగ్ బీ మనవరాలు ఆరాధ్య, కోడలు ఐశ్వర్యలు కరోనా మహమ్మారితో పోరాడి గెలిచారు. అమితాబ్ కూడా కరోనాను జయించాడు. కానీ, అభిషేక్ మాత్రం ఇంకా హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే.. జూనియర్ బచ్చన్ ఆస్పత్రిలో తన హెల్త్ కేర్ బోర్డ్ ఫొటోను షేర్ చేశాడు.
మొన్నటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న అమితాబ్.. తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉండేవాడు. అభిషేక్ కూడా అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన ఆరోగ్య విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన హెల్త్ కార్డ్‌ను షేర్ చేయగా, అందులో డిశ్చార్జ్ ప్లాన్ వద్ద ‘నో’ అని ఉంది. అంతేకాదు ఆయన ఆస్పత్రిలో చేరి ఇప్పటికే 26 రోజులు గడిచిపోయాయి. అయితే ఆ ఫోటోతో పాటు ‘కమాన్ బచ్చన్.. నువ్వు సాధించగలవు’ అంటూ ట్వీట్ చేశాడు జూనియర్ బచ్చన్. ఈ ట్వీట్‌కు ఆయన సోదరి శ్వేత బచ్చన్ స్పందిస్తూ.. గ్యాంగ్ అంతా నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. నువ్వు సాధిస్తావు అంటూ ధైర్యం చెప్పింది. ప్రస్తుతం అభిషేక్.. ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CDg5qnGpTMC/?utm_source=ig_embed