అమ్మ … నా అభిమాన పదం : అభిషేక్

by Shyam |   ( Updated:2020-04-09 01:01:19.0  )
అమ్మ … నా అభిమాన పదం : అభిషేక్
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్నటి తరం నటి జయా బచ్చన్ బాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారామే. అమితాబచ్చన్ అర్ధాంగి అయిన ఆమె ఇప్పటికీ బాలీవుడ్‌లో ప్రత్యేక హోదా, ప్రత్యేక గౌరవం పొందుతున్నారు. గురువారం 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న జయా బచ్చన్‌కు ఇండస్ట్రీతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా… తన పిల్లలు అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్‌లు సోషల్ మీడియా వేదికగా అందించిన జన్మదిన శుభాకాంక్షలు తల్లి మీద ప్రేమకు నిర్వచనంలా ఉన్నాయి.

జయా ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అభిషేక్ బచ్చన్.. అందరు పిల్లల్లాగే నాకూ అభిమాన పదం అమ్మ… హ్యాపీ బర్త్ డే అమ్మ… లాక్ డౌన్ కారణంగా మీరు ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చింది..మేము ముంబైలో ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నాం అమ్మా… మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు… ఐ లవ్ యూ..అంటూ విష్ చేశాడు చోటా బచ్చన్.

బిగ్ బి కూతురు శ్వేతా బచ్చన్.. తన తల్లితో అభిషేక్, తను ఉన్నా ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అమ్మా.. నీ హృదయాన్ని నా హృదయంలో బంధించాను.. నీ ప్రేమ లేకుండా ఎప్పుడూ, ఎక్కడికి వెళ్లలేను.. హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్ యూ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.


Tags: Jaya Bachan, Abhishek Bachan, Amitab Bachan, Shwetha Bachan, Bollywood

Advertisement

Next Story